దీనెమ్మా కిక్కు.. పూరి ఒక డ్రగ్ – రామ్

Published on Jul 11, 2019 6:42 pm IST

పూరి జగన్నాథ్ ఎలాగైనా ఈ సారి ఓ భారీ హిట్ కొట్టాలనే కసితో చేసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్, నిధి అగ‌ర్వాల్‌ – న‌భా న‌టేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ జూలై 18న విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా చూసిన హీరో రామ్, సినిమా గురించి తనదైన శైలిలో స్పందించాడు. రామ్ ట్వీట్ చేస్తూ.. ‘ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూశాను. దీనెమ్మా కిక్కు.. ఈ పాత్రను పోషించినప్పుడు గానీ, ఆ పాత్రను స్క్రీన్ మీద చూసినప్పుడు గాని.. నాకు ఇచ్చిన కిక్కు.. ఈ మధ్య కాలంలో నాకు ఏ సినిమా ఇవ్వలేదు. థ్యాంక్యూ పురిగారు. మీరు డ్రగ్ లాంటి వారు’ అంటూ రామ్ ట్వీట్ చేసాడు.

మొత్తానికి రామ్ కి ఇస్మార్ట్ శంకర్ ఓ రేంజ్ లో నచ్చినట్లు ఉంది. గతంలో తన ఏ సినిమాకి రామ్ ఇలా ట్వీట్ చెయ్యలేదు. ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ తోనే మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. సినిమాలో యూత్ ని ఆకర్శించే బూతులు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయట. మరి ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ హిట్ కొడతాడేమో చూడాలి.

ఇక మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌ల‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో రామ్‌ సరికొత్త లుక్‌ లో కనపించబోతున్నారు. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :