‘ఛార్మి’ని సర్ ప్రైజ్ చేసిన ‘ఎనర్జిటిక్ స్టార్’ !

Published on May 16, 2019 5:41 pm IST

ఇండస్ట్రీకి వచ్చి పదిహేను ఏళ్ళు అవుతున్నా.. సినిమా మీద ఇష్టం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అంట చార్మింగ్ బ్యూటీ ఛార్మికి. అందుకే ఆ ఇష్టంతోనే హీరోయిన్ అవతారం నుంచి, నిర్మాత అవతారం ఎత్తానంటుంది ఈ బబ్లీ బ్యూటీ. ఇక రేపు ఛార్మి పుట్టిన రోజును జరుపుకోబోతుంది. కాగా ఛార్మికి ఒకరోజు ముందుగానే పుట్టిన రోజు గిఫ్ట్ లు కూడా అందుతున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఛార్మికి గిప్ట్ ఇచ్చారు.

ఆ విషయాన్ని ఛార్మీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. “ఒక రోజు ముందుగానే నా పుట్టిన రోజుకి నన్నుసర్ ప్రైజ్ చేశారు. ఎప్పటి నుండో నేను ఒకటి ఇష్టపడుతూ ఉన్నాను. మా హీరో రామ్, నేను ఏదైతే ఇష్టపడుతున్నానో, దాన్నేనాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అన్నిటికి మించి రామ్ నా పై రాసిన కొటేషన్ కి నేను నవ్వలేక చచ్చిపోయా. మొత్తానికి మా ఇస్మార్ట్ శంకర్ కి థ్యాంక్ యూ” అంటూ అని ఛార్మి పోస్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :

More