సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తను.. నేను.. మహ్మద్ రఫీ’

Thanu_Nenu_Mohammad_Rafi
సంజిత్, శ్రావణి, అనేష్ బాబు, రమణ, నానాజీ నటీనటులుగా ఓం ప్రకాష్ మార్తా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తను.. నేను.. మహ్మద్ రఫీ’. అశ్వద్దామ క్రియేషన్స్ పతాకంపై ఏకాంతిక సమర్పణలో కె. అనేష్ బాబు నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సోమవారం నాడు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల అభినందన మాలో ఉత్సాహాన్ని నింపింది. త్వరలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత అనేష్ బాబు తెలిపారు.

సైబర్ క్రైమ్ నేపధ్యంలో తండ్రికొడుకుల మధ్య అనుభందాన్ని సహజంగా చూపే ప్రయత్నం చేశామని దర్శకుడు ఓం ప్రకాష్ మార్తా తెలిపారు. సినిమా విజయం సాధిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. నాని సంగీతం అందించిన ఈ సినిమాకు చందు పొన్నాల, కిట్టు, శ్రీపతి సాహిత్యం సమకూర్చారు.

Exit mobile version