అరవింద సమేత సెట్లోకి అనుకోని అతిధి !
Published on Jun 22, 2018 9:12 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత చిత్ర షూటింగ్ బిజీ లో ఉన్నారు . ఈ రోజు ఆయనను కలవడానికి యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమా సెట్ కు వచ్చారు. తరుణ్ భాస్కర్ తారక్ ను కలిసి కాసేపు సరదాగా ముచ్చట్టించారు అనంతరం ఇద్దరు కలిసి ఫొటో దిగారు ఇప్పుడు ఆ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ‘పెళ్లి చూపులు’ చిత్రం తరువాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook