డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారి బిజీ అయిన తరుణ్ భాస్కర్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ మంచి బజ్ క్రియేట్ చేసింది. మోగుడు-పెళ్లాం మద్య ఈగో క్లాష్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏ.ఆర్.సజీవ్ డైరెక్ట్ చేశారు. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటం విశేషం. గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథలో హీరోకు నచ్చని పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత తన భార్యతో హీరో ఎలా ప్రవర్తించాడు.. అతడి భార్య దానికి ఎలా స్పందించి.. వారి మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి.. ఈ క్రమంలో జరిగే ఫ్యామిలీ డ్రామా ఎలా ఉండబోతుంది.. అనే కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తరుణ్ భాస్కర్ తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ ట్రైలర్‌లో ఈషా రెబ్బా నుంచి ఎలాంటి డైలాగులు రాకపోవడంతో ఆమె పాత్ర పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో గోదారోళ్ళ ఎటకారం మనకు మరింత చూపించబోతున్నారు చిత్ర యూనిట్. జే క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాదిక్ షేక్, నవీన్ శనివారపు ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని జనవరి 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


