తర్వాతి సినిమా కోసం అనీషాను సెలెక్ట్ చేసుకున్న తరుణ్ !
Published on Nov 9, 2017 8:27 am IST

గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ అందుకున్న భారీ విజయాల్లో ‘పెళ్లి చూపులు’ చిత్రం కూడా ఒకటి. నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీ కలెక్షన్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు చెదిరే లాభాల్ని తెచ్చిపెట్టింది. దీంతో ఆయన చేయబోయే రెండవ ప్రాజెక్ట్ ఫై కూడా బోలెడంత ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో.

ప్రస్తుతం అయన ఆ రెండవ సినిమా పనుల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ పనులు పూర్తవగా నటీ నటుల ఎంపికలో ఉన్నారు తరుణ్ భాస్కర్. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్ మీద కొత్తగా కనిపిస్తూనే తెలుగు స్పష్టంగా మాట్లాడగల నటి కోసం వెతుకుతూ అనీషాను ఫైనల్ చేశారట. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 
Like us on Facebook