ఆ సెంటిమెంట్ కి బలైన సుకుమార్

Published on Apr 3, 2020 9:03 am IST

టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న సుకుమార్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళలో ఆయన చేసింది కేవలం 8 సినిమాలు మాత్రమే. యావరేజ్ గా ప్రతి రెండేళ్లకు ఆయన ఓ సినిమా చేశారు. స్టార్ డైరెక్టర్ హోదా ఎప్పుడో దక్కించుకున్న సుకుమార్ వెంట వెంటనే సినిమాలు చేయడంలో విఫలం చెందుతూ ఉంటాడు. 2018లో చరణ్ తో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఆయనకు హీరో దొరకలేదు.

సుకుమార్ నిజానికి మహేష్ తో వెంటనే సినిమా మొదలుపెట్టాలని అనుకున్నారు. అప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ మహేష్ అనుకోకుండా వేరే దర్శకులతో కమిటై సుకుమార్ కి హ్యాండ్ ఇచ్చాడు. దీనితో సుకుమార్ నెక్స్ట్ ఆప్షన్ గా బన్నీని పెట్టుకోగా ఆయన త్రివిక్రమ్ సినిమా తరువాత చేద్దాం అని చెప్పడంతో, సుకుమార్ కి చేసేదేమి లేక, అల వైకుంఠపురంలో విడుదల వరకు ఎదురు చూశాడు. ఇక తీరా షూటింగ్ మొదలుపెట్టి 2020లో బన్నీ మూవీ విడుదల చేద్దాం అనుకుంటే కరోనా దెబ్బేసింది. 2020 లో ఈ మూవీ విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎప్పటిలాగే సుకుమార్ ఆ సెంటిమెంట్ కి బలయ్యాడు.

సంబంధిత సమాచారం :

X
More