రేపు సాయంత్రమే మహాలక్ష్మి టీజర్ !

రేపు సాయంత్రమే మహాలక్ష్మి టీజర్ !

Published on Dec 21, 2018 2:11 AM IST

mahalakshmi3

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. హిందీలో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన చిత్రీకరణ పూర్తియి పోస్ట్ ప్రోడుక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ చిత్రం టీజర్ విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు