అనసూయ బిగ్ బాస్ కి ఎందుకు రాలేదంటే…!

Published on Aug 9, 2019 4:41 pm IST

అనసూయ ప్రధాన పాత్రలో నటించిన కధనం చిత్రం నేడు విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కధనం మూవీలో అనసూయ లేడీ డైరెక్టర్ పాత్ర చేయడం జరిగింది. చిత్ర విడుదల సంధర్బంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న అనసూయ చిత్రంతో పాటు ఆమెకు సంబందించిన అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఐతే మీరు బిగ్ బాస్ రియాలిటీ షో లో ఎందుకు పాల్గొనలేదు అన్న ప్రశ్నకు ఆమె ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు.

నిజానికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చినా,కొన్ని కారణాలతో సున్నితంగా తిరస్కరించాను అన్నారు. నేను ఫ్యామిలీని వదిలి అన్నిరోజులు ఉండలేకపోవడం ఒక రీజన్ ఐతే, బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులందరు తెలిసినవారు కావడంతో వద్దనుకున్నాను, అని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ కి వెళితే ఇంటి సభ్యులతో గొడవలు సాధారణం, తెలిసిన వారితో గొడవలు పడటం ఎందుకు అని వద్దనుకున్నాను అని అనసూయ చెప్పకనే చెప్పారు.

సంబంధిత సమాచారం :