ఆ సెంటిమెంట్ కి బలైన మహేష్ డైరెక్టర్

Published on Feb 25, 2020 6:57 am IST

మహర్షి మూవీ తో మహేష్ కి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రం కూడా మహేష్ తో డిసైడ్ అయ్యారు. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సమయంలో నే వంశీ మహేష్ కి కొన్ని లైన్స్ చెప్పడం, వాటిలో ఓ లైన్ నచ్చి స్క్రిప్ట్ డెవలప్ చేయమడంతో కొన్ని నెలలుగా వంశీ కష్టపడి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. రెండు నెలలో సెట్స్ పైకి వెళుతుందనగా, మహేష్ వంశీ కి షాక్ ఇచ్చాడు. స్క్రిప్ట్ విషయంలో సంతృప్తిపడని మహేష్ ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారు.

కెరీర్ బిగినింగ్ నుండి వంశీ చేసింది కేవలం ఐదు సినిమాలే. ఐతే దాదాపు స్టార్ హీరోలతో చేశారు వంశీ. ఐతే ఒక సినిమా నుండి మరో సినిమాకు రెండు నుండి అత్యధికంగా నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు మహర్షి తర్వాత ఏడాదిలోపు సినిమా ప్రారంభింద్దాం అనుకుంటే మహేష్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు. దీనితో వంశీ తనను కెరీర్ బిగినింగ్ నుండి వదలని గ్యాప్ సెంటిమెంట్ కి బలయ్యాడని అంటున్నారు. వంశీ మరో హీరోని వెతుక్కొని సినిమా మొదలుపెట్టడానికి ఎన్నాళ్ళ సమయం పడుతుందో…

సంబంధిత సమాచారం :