ఆ చిన్న సినిమా ట్రైలర్ కు ఇంప్రెస్ అయిన బాహుబలి నిర్మాత !

Published on Jul 10, 2018 11:25 am IST

నూతన దర్శకుడు లక్ష్మీకాంత్ చిన్న దర్శకత్వంలో విరాట్ కొండూరు, సిమ్రాత్ కౌర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా ‘పరిచయం’. నిన్న ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ హీరో నితిన్ చేతుల మీదగా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ‘పరిచయం’ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.

తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ‘పరిచయం’ ట్రైలర్ ను చూసి స్పందించారు. ‘పరిచయం చిత్రబృందానికి అభినందనలు. ట్రైలర్ చాలా బాగుంది. చూసిన వెంటనే ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రముఖులు ‘పరిచయం’ చిత్రబృందాన్ని అభినందించడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి పెరుగుతుంది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఆసిన్ మూవీ క్రెయేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :