ఆర్ ఆర్ ఆర్ లో అసలు ట్విస్ట్ అదే…!

ఆర్ ఆర్ ఆర్ లో అసలు ట్విస్ట్ అదే…!

Published on Aug 6, 2019 7:20 AM IST

రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో వీరిద్దరూ ఉద్యమ వీరులు కొమరం బీమ్, అల్లూరి సీతారామ రాజులుగా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా స్నేహితుల రోజు సందర్భంగా రెండు రోజుల క్రితం ఆర్ ఆర్ ఆర్ టీమ్ నిర్వహించిన కార్యక్రమంలో వారు కొమరం కొమరం భీమ్, అల్లూరి అనుకోకుండా మంచి మిత్రులు అవుతారని చెప్పకనే చెప్పారు.

ఐతే ఈ పోరాట వీరులిద్దరూ వేరు వేరు ప్రాంతాలకు, వేరు వేరు నేపధ్యాలు కలిగిన వారు కావడం గమనార్హం. అల్లూరి 1897 లో జన్మించి, విశాఖ ప్రాంతానికి చెందిన అడవి జాతి ప్రజల హక్కుల కొరకు పోరాడి 1924లో ప్రాణాలు విడిచారు. కొమరం భీమ్ 1901లో జన్మించి హైదరాబాద్ నవాబు పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1940లో మరణించడం జరిగింది.

వీరిద్దరూ కలిసినట్టుగా చరిత్రలో ఎక్కడా బలమైన ఆధారాలు లేవు.మరి వీరిద్దరూ గొప్ప స్నేహితులు ఎలా అయ్యారు అనేది ఆసక్తికరం. ఐతే ఆర్ ఆర్ ఆర్ టీమ్ మాత్రం వీరిద్దరూ కలిసి పోరాటం చేస్తారనే విషయాన్ని మాత్రం ధృవీకరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు