చరణ్ ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తున్న ఆ రోల్..!

Published on Feb 21, 2020 7:06 am IST

దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ లో చరణ్ కూడా నటిస్తున్నాడన్న న్యూస్ బయటికి వచ్చినప్పటి నుండి మెగా ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తండ్రి చిరంజీవి యువకుడిగా కనిపించే సన్నివేశాల కోసం చరణ్ ని తీసుకున్నారు. అంటే యంగ్ చిరుగా చరణ్ కనిపించనున్నాడు. ఇప్పుడు ఇదే న్యూస్ ఫ్యాన్స్ కి గూస్ బమ్స్ కలిగిస్తుంది. చరణ్ ని కొరటాల 90’ల కాలంలో చిరు లా చూపించనున్నాడు. ఆ గెటప్ లో చరణ్ హావ భావాలతో పాటు, ఆహార్యంలో చిరుని మైమరిపించడం ఖాయం అనిపిస్తుంది. ఈ పాత్రలో చరణ్ ని ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎక్సైట్ అయిపోతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని చరణ్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో మేజర్ షూటింగ్ జరిపారు. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

సంబంధిత సమాచారం :