లైంగిక ఆరోపణల కేసులో ప్రముఖ నటుడికి క్లీన్ చిట్.

Published on Jun 14, 2019 1:04 am IST

మీటూ ఉద్యమం బాలీవుడ్ లో ఎన్ని ప్రకంపనలు రేపిందో తెలిసిందే. సినీ పరిశ్రమలోని దర్శకులు,నిర్మాతలు, అలాగే నటులు మమల్ని లైంగిక వేదింపులకు గురిచేశారని, చాలా మంది తారలు బయటపడి పెద్ద ఉద్యమమే చేశారు. అలాంటి వారిలో తనుశ్రీ దత్తా ఒకరు. ఆమె ఏకంగా ప్రముఖ హిందీ నటుడైన నానా పటేకర్‌ పై లైంగిక ఆరోపణలు చేశారు. “హార్న్‌ ఓకే ప్లీస్‌”మూవీ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్‌ తనతో ఓ శృంగార సన్నివేశంలో నటించాలని కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యతో కలిసి ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో తనతో పాటు తన కారులో ఉన్న కుటుంబ సభ్యులపై వారు దాడికిచేసారని తనుశ్రీ దత్తా ఆరోపించారు.

అప్పట్లో ఈ విషయం బాలీవుడ్ లో సంచలనం రేపింది. బాలీవుడ్ సీనియర్ నటుడిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో చిత్ర పరిశ్రమ షాక్ కి గురైంది. ఐతే తాజా సమాచారం ప్రకారం నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లభించనందున కేసును మూసివేసినట్టు సమాచారం. దీనితో నానా పాటేకర్ కి ఊరట లభించినట్లైంది.

సంబంధిత సమాచారం :

More