‘ఫ్యామిలీ మ్యాన్’ తండ్రికి తీవ్ర అస్వస్థత.!

Published on Sep 18, 2021 8:00 am IST

ఇప్పుడు మన దేశంలో కూడా వెబ్ కంటెంట్ ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. అలా మన దేశం నుంచి వచ్చిన ఎన్నో సాలిడ్ వెబ్ సిరీస్ లలో సూపర్ హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్” కూడా ఒకటి. అయితే ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా కనిపించే విలక్షణ నటుడు మనోజ్ భాజ్ పై కోసం తెలిసిందే. ఎన్నో తెలుగు చిత్రాల్లో తనదైన నటనను కనబరిచి ఇప్పుడు ఓటిటి లో సూపర్ స్టార్ గా ఉన్నారు.

అయితే ఇప్పుడు తన తండ్రి ఆర్ కె భాజ్ పై కాయస్థ అస్వస్థతకు లోనయ్యినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నిమిత్తం కేరళలో షూట్ తో బిజీగా ఉండగా ఈ వార్త తెలిసిన వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు. మరి ఆర్ కె భాజ్ పై గారు ప్రస్తుతం హాస్పిటల్ లో హెల్త్ ఎమర్జెన్సీ పై చికిత్స పొందుతున్నారట. మరి ఆయన త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :