బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేస్తున్న ప్రముఖ హీరో కూతురు !

Published on Jul 8, 2018 9:14 am IST

ఒక్కప్పటి హీరోగా ఇప్పటి బహుభాషా నటుడిగా శరత్‌ కుమార్‌ ఎంతో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు హీరోయిన్ గా ఇటు వైవిధ్యమైన పాత్రలను పోషించే నటిగా తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ప్రస్తుతం ఆమె ఓ చిత్రంలో మరో వైవిధ్యమైన పాత్రను పోషించబోతున్నారు.

జేకే అనే ఓ నూతన దర్శకుని దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ బ్లైండ్‌ క్యారెక్టర్‌ లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కొత్త చిత్రంలో మొదటిసారిగా ఓ బ్లైండ్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాను. ఈ చాలెంజింగ్‌ రోల్‌ ను బాగా పోషించాలని కోరుకొండి. నేను మాత్రం ఈ పాత్ర పట్ల బాగా ఎగై్జటింగ్‌ తో ఉన్నానని ఆమె తెలిపారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మాథ్యూ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :