‘బిగ్ బాస్ సీజన్‌ 3’ విజేత పై నాగ్ ట్వీట్ !

Published on Nov 3, 2019 12:45 pm IST

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ షో.. నేడు సీజన్‌ 3 ఫైనల్ జరుపుకోబోతుంది. మరికొన్ని గంటల్లో సీజన్ 3 విజేత ఎవరనేది తేలనుంది. కాగా ఫైనల్లో మొత్తం ఐదుగురు సభ్యులు నిలువగా.. వారిలో విజేతగా నిలిచే అవకాశం ఎక్కువుగా శ్రీముఖికి, లేదా రాహుల్‌ సిప్లిగంజ్‌ కు మాత్రమే ఉందని.. అలాగే ఇప్పటికే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 టైటిల్‌ ను రాహుల్‌ గెలుచుకున్నాడని సోషల్‌ మీడియాలో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

కాగా తాజాగా ఈ రూమర్స్ చెక్ పెడుతూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. ఇంకా బిగ్ బాస్ ఫైనల్ షూటింగ్ పూర్తి కాలేదని, ఈ రోజు సాయంత్రం లైవ్‌ ప్రసారం జరుగనుందని.. సోషల్ మీడియాలో విన్నర్ గురించి వస్తున్న రూమర్స్ ని నమ్మకండి. సాయంత్రం జరిగే లైవ్ కార్యక్రమంలో విన్నర్ ఎవరనేది తెలుసుకోండని నాగార్జున పోస్ట్ చేశారు. మరి బిగ్ బాస్ సీజన్‌ 3 విన్నర్ ఎవరో చూడాలి.

సంబంధిత సమాచారం :