ఫస్ట్ లుక్ తో రానున్న విక్రమ్ ‘కోబ్రా’ !

Published on Feb 27, 2020 5:43 pm IST


హీరో చియాన్ విక్రమ్ వరుసగా పెద్ద సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారీ అంచనాలు ఉన్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రాన్ని అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తమిళంలో రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది.

వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో విక్రమ్ సుమారు 25 భిన్నమైన వేషధారణల్లో కనిపించనున్నారు. ఇక ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ లుక్ చాలా వైవిధ్యంగా ఉండనుందని కోలీవుడ్ వర్గాల భోగట్టా. అలాగే టైటిల్ డిజైన్ లోనే చాల క్లూస్ కూడా ఉన్నాయట. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More