వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “ఘాజీ”

Published on Aug 13, 2021 8:00 pm IST

రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో, కె కె మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ, ఓం పూరి, రాహుల్ సింగ్, నాసర్, సత్యదేవ్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఘాజీ. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం విడుదల అయి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం ను ఆగస్ట్ 15 వ తేదీన ఉదయం 9 గంటలకు స్టార్ మా ప్రసారం చేయనుంది. ఈ చిత్రం తొలిసారి టెలివిజన్ లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :