మహేష్ బ్రాండ్ ప్రభంజనం ఖాయమంటున్నారు

Published on Aug 8, 2019 10:16 am IST

ప్రిన్స్ మహేష్ బాబు నిన్న ముందుగా చెప్పిన విధంగానే తన వస్త్ర వ్యాపారానికి సంబంధించిన బ్రాండ్”ది హంబుల్ కో” ని అభిమానుల సమక్షంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది.హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ అభిమానులు పాల్గొని సందడి చేశారు. అలాగే ఈ బ్రాండ్ ప్రారంభానికి ముందు మహేష్ టీం నిర్వహించిన కాంటెస్ట్ లో విజేతలైన ఐదుగురు అభిమానులు సుధీర్ కుమార్ 33992, డి రాజేష్ రెడ్డి, మహేష్ నంబూరి, అంజలి ఓరుగంటి, అశోక్ శ్రీశైలపు లను మహేష్ ప్రత్యేకంగా కలవడం జరిగింది.

సరికొత్త శ్రేణిలో వినూత్నంగా అభిమానులతో పాటు, అందరూ మెచ్చేలా ఈ బ్రాండ్ వస్త్రాలు ఉండనున్నట్లు సమాచారం. మహేష్ ప్రమోట్ చేసే ఇతర కంపెనీల ఉత్పత్తులకే అమిత ఆదరణ నెలకొన్న తరుణంలో మహేష్ సొంత బ్రాండ్ ది హంబుల్ కో గార్మెంట్ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించే అవకాశం కలదు.ఖచ్చితంగా ది హంబుల్ కో వస్త్ర పరిశ్రమపై తన మార్కు ముద్ర వేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. కాగా మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ జరుపుకుంటుంది. ట్రైన్ జర్నీ నేపథ్యంలో నడిచే హాస్యసన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు సమాచారం.

ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, విజయశాంతి,రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :