ది జర్నీ ఆఫ్ ‘భగవంత్ కేసరి’ నా లైఫ్ లో ఒక స్పెషల్ గా నిలిచిపోతుంది – అనిల్ రావిపూడి

Published on Jun 9, 2023 2:04 am IST


టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న మూవీ భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఒక ప్రధాన పాత్ర చేస్తుండగా అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక నేడు బాలయ్య మాస్ మంత్ర సాంగ్ ని పలువురు బాలయ్య అభిమానులతో కలిసి లాంచ్ చేసారు అనిల్ రావిపూడి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి బాలయ్య గారు నటించిన అనేక సినిమాలు చూస్తూ పెరిగానని, ఇక తొలిసారిగా ఆయనని డైరెక్ట్ చేసే అవకాశం తనకు రావడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు. ఇక సెట్స్ లో బాలయ్య గారు ప్రతి ఒక్కరికీ ఎంతో రెస్పెక్ట్ ఇస్తారని, ఇక ఆయనతో వర్క్ చేసిన తరువాత ఆయన మీద ఉన్న అభిమానంతో పాటు గౌరవం వందరెట్లు పెరిగిందని తెలిపారు. ఇక భగవంత్ కేసరి మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ తన కెరీర్ లో ఎంతో స్పెషల్ గా ఉంటుందని, ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి అనేది తప్పకుండా తనతో పాటు బాలయ్య గారి ఫ్యాన్స్ లో కూడా స్పెషల్ గా నిలిచిపోతుందని తెలిపారు. తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు అనిల్ రావిపూడి. కాగా ఈ మూవీ రానున్న దసరా కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :