కలెక్షన్స్ లో ప్రభంజనం సృష్టిస్తోన్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ !

Published on Mar 14, 2022 3:33 pm IST

ఒక సినిమా బాగుంది అంటే.. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ పోతాయి. తాజాగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ అనే సినిమా విషయంలో ఇది నిజం అని మరోసారి రుజువు అయ్యింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ప్రస్తుతం ఎగబడుతున్నారు. మౌత్ టాక్ కూడా అద్భుతంగా ఉండటంతో కలెక్షన్స్ అనూహ్యంగా పెరిగాయి.

ఒకసారి ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే.. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 4.25 కోట్లు వచ్చాయి. అయితే, రెండో రోజు 10.10 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఏకంగా 17.25 కోట్లు వచ్చాయి. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రభంజనం సృష్టిస్తోంది.

కాగా బాలీవుడ్‌ దిగ్గజ నటులు మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ప్రముఖ బీటౌన్‌ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా నిర్మాత మన తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కావడం విశేషం. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘గడిచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం :