మరో ఘనత దక్కించుకున్న మహానటి !

Published on Jul 17, 2018 9:40 am IST


అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాదిలో భారీ విజయాలు సాధించిన చిత్రాల్లో ఇది కూడ ఒకటి. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించగా ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాతో మరోసారి తన ఉనికిని ఘనంగా చాటుకుంది.

కాగా, ఇప్పుడు ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌‌కు మహానటి చిత్రం నామినేట్‌ అయ్యింది. స్వయంగా చిత్రబృందమే ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంది. మొత్తం మీద మహానటి చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీ పడుతోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి చిత్రం పరాయి దేశాల్లోనూ గొప్ప ఆదరణ పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా చిత్రం మూడు కేటగిరీల్లో ఎంపికైనందుకు గర్వంగా కూడా ఉంది’ అని తెలిపారు.

సంబంధిత సమాచారం :