టాక్..”ఆదిపురుష్” నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రాబోతోందా.?

Published on Mar 29, 2022 9:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ అయ్యిపోయిన భారీ సినిమా “ఆదిపురుష్”. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ పై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంతోనే ప్రభాస్ మళ్ళీ గట్టి బౌన్స్ బ్యాక్ ఇస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓ అంశం కోసం చాలా అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం. ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తాడా అని ఒకటే అందరిలో ఉత్కంఠ.

అయితే పలు స్పెషల్ అకేషన్స్ దాటేస్తున్నా మేకర్స్ మాత్రం ఆ లుక్ ని మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు. కానీ ఈసారి మాత్రం శ్రీరామ నవమి పర్వదినాన ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారు అన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇదే నిజం అయితే ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ కి తెర పడినట్టే అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :