మహేష్ సినిమా పై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం – కొరటాల శివ

Published on Jul 17, 2018 5:20 pm IST


కొరటాల శివ దర్శకత్వంలో ‘సూపర్ స్టార్ మహేష్ బాబు’ హీరోగా నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘భరత్ అనే నేను’ చిత్రం. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ వసూళ్లు సాధించింది. నిజానికి ఈ సినిమాకు విడుదల ముందు నుండే పాజిటివ్ బజ్ ఉండటం, సినిమా విడుదలైన తర్వాత కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇంతటి భారీ విజయం సాధించిన ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య ‘డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌’ పతాకం పై నిర్మించారు. కాగా ఈ చిత్ర దర్శకుడు కొర‌టాల శివ‌కు, హీరోయిన్ కైరా అద్వానీలకు ఈ చిత్రానికి సంబంధించి మొత్తం పారితోషకం ఇవ్వలేద‌ని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్’ ట్విటర్ ద్వారా ఈ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ వార్తలు పై ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘ ‘భరత్ అనే నేను’ చిత్రానికి సంబంధించి నాకు రెమ్యునిరేషన్ మొత్తం రిలీజ్ కి ముందే ఇచ్చారు. రామానాయుడుగారి తర్వాత మనకున్న మంచి నిర్మాతల్లో దానయ్య ఒకరు. ఈ చిత్రానికి సంబంధించి మాకు మొత్తం పారితోషకం ఇవ్వలేద‌ని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అసత్యం. ఈ అసత్య ప్రచారాలను నేను ఖండిస్తున్నాను’ అని ఈ క్రేజీ డైరెక్టర్ తెలిపారు.

సంబంధిత సమాచారం :