ఇండియన్ సినిమాలో ఆసక్తికర సబ్జెక్ట్ తో వస్తున్న “ది నైట్”.!

Published on May 27, 2021 4:02 pm IST

సినిమాలకు హద్దులు ఉండవు జానర్ అయినా కూడా ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడమే వాటి పరమావధి. మారి జానర్స్ లో కొన్ని స్పెషల్ జానర్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో సృజనాత్మకతతో కూడిన థ్రిల్లర్ జానర్ కూడా ఒకటి. మరి అలాంటి ఇంట్రెస్టింగ్ కోణంలో ఇండియన్ సినిమా దగ్గర మూడు భాషల్లో సిద్ధం అవుతున్న చిత్రం “ది నైట్”. హాలీవుడ్ తరహా టైటిల్ తో వచ్చిన ఈ చిత్రంలో కంటెంట్ కూడా అలానే అనిపిస్తుంది.

ప్రముఖ నటులు విదు బాలాజీ మరియు సాక్షి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆర్ భువనేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో సబ్జెక్టు లోకి వస్తే “కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఒక అరుదైన చీమల ఫోటోగ్రఫి కోసం ఒక ప్రమాదకరమైన అడవులకు వెళ్తారు.

కానీ అక్కడి ఆదివాసీల ద్వారా అక్కడ ఉండే ఒక తోడేలు కరిస్తే ఆ వ్యక్తి సూపర్ పవర్స్ తెచ్చుకుంటాడని తెలియజేస్తారు” ఇలాంటి యానిమల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాలుకా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి కలాస జె సెల్వం సహా గోకుల కృష్ణన్ నిర్మాణం వహిస్తుండగా రణ్వీర్ కుమార్ లాంటి బాలీవుడ్ నటులు కూడా ఈ చిత్రంలో ఉన్నారట. అలాగే ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో అతి త్వరలోనే విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :