ఓటిటి లోకి వచ్చేసిన ది నన్2!

ఓటిటి లోకి వచ్చేసిన ది నన్2!

Published on Feb 7, 2024 11:09 PM IST

హాలీవుడ్ హారర్ మూవీ ది నన్ 2, 2018 లో రిలీజైన బ్లాక్‌బస్టర్ ది నన్‌కి సీక్వెల్. ది కంజురింగ్ యూనివర్స్‌లో ఇది ఎనిమిదో విడత. సెప్టెంబర్ 2023లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రం భారతదేశంలో ఈరోజు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అయిన జియో సినిమా లోకి వచ్చేసింది.

ఇంగ్లీష్ తో పాటు ఈ సినిమా తెలుగు, హిందీ మరియు తమిళంలో ప్రసారం చేయడానికి కూడా అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా విభిన్న ప్రేక్షకులను అలరించనుంది. మైఖేల్ చావ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైస్సా ఫార్మిగా, జోనాస్ బ్లాకెట్ మరియు బోనీ ఆరోన్స్ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు