రామ్ వాయిస్ రొమాంటిక్ కి ప్లస్ అవుతుంది !

రామ్ వాయిస్ రొమాంటిక్ కి ప్లస్ అవుతుంది !

Published on Jul 4, 2020 10:04 PM IST

‘హీరో రామ్’ ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ తరువాత, ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తనకు మంచి హిట్ మూవీ ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోసం , పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న ‘రొమాంటిక్’ సినిమా కోసం రామ్ వాయిస్ ఓవర్ చెబుతున్న సంగతి తెలిసిందే. రామ్ వాయిస్ ఓవర్ ఇప్పటికే చెప్పేసినట్లు తెలుస్తోంది. రామ్ వాయిస్ ఫుల్ ఎనర్జీ.. అలాంటి రామ్ వాయిస్ తో రొమాంటిక్ మొదలు కాబోతుందంటే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది.

కాగా కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పూరి నిర్మిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరి హిట్ కొడతాడేమో చూడాలి. అన్నట్టు ఛార్మి కూడా పూరి జ‌గ‌న్నాథ్ తో కలిసి పూరి టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు