డబ్బుకంటే స్క్రిప్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటున్న మహానటి !
Published on Jul 17, 2018 7:43 pm IST

నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించి విమర్శకులను సైతం తన నటనతో మెప్పించింది. సావిత్రిగా ఆమె తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరేమో అనేంతగా ఆ చిత్రంలో కీర్తి నటన ఉంది.

కాగా మహానటి చిత్రంతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌ గా మారిపోయింది. దాంతో ఆమె తన పారితోషకాన్ని భారీగా పెంచిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఆ వార్తలను ఖండించింది. తాను నటన మీద మక్కువతో ఎంతో ఫ్యాషన్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, కేవలం డబ్బు కోసం కాదని తెలిపింది. తానెప్పుడూ మంచి కథకు, పెర్ఫార్మెన్స్‌ కి ప్రాధాన్యం ఇస్తాను తప్ప, పారితోషకానికి కాదని కీర్తి సురేష్ వెల్లడించింది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook