ట్రైల‌ర్ తో వచ్చిన ‘నేనే కేడీ నెం-1’ !

Published on Jul 11, 2019 1:00 am IST

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం `నేనే కేడీ నెం-1′. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైల‌ర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా` నేనే కేడీ నెం-1` ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది.

ట్రైల‌ర్ రిలీజ్ చేసిన అనంత‌రం.. ‘ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత జాని మాట్లాడుతూ…‘‘మంచి ఎంట‌ర్‌ టైన్ తో వ‌స్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `నేనే కేడి నెం-1`. ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి వ‌దిలేస్తున్నారు. ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. ఈ సినిమాను ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరా : శ్రావ‌ణ్ కుమార్; ఎడిట‌ర్ : సాములేటి శ్రీనివాస్ ; స్టోరీ – స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాత : జాని.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More