శ్రుతి హాసన్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తాను ఎప్పుడూ దాన్ని దృష్టిలో పెట్టుకోలేదని తాజాగా శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీకి రావడానికి ముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు శ్రుతి హాసన్ తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి హాసన్ తన చిన్ననాటి విషయాలు తెలిపింది.
శ్రుతి హాసన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా జీవితంలో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నా తల్లిదండ్రులు విడిపోవడం నన్ను ఎంతో బాధించింది. వారిద్దరూ విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై నుంచి ముంబై వచ్చేశాం. విలాసవంతమైన జీవితం దూరమైంది. అప్పటివరకూ మెర్సిడెస్ బెంజ్ కారులో తిరిగిన నేను లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాను. రెండు రకాల జీవితాలు చూశాను. ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతో ఎక్కువగా ఉంటున్నాను’ అని శ్రుతిహాసన్ చెప్పింది.


