సమీక్ష : తెప్ప సముద్రం – జస్ట్ కొన్ని సీన్స్ కోసం మాత్రమే !

సమీక్ష : తెప్ప సముద్రం – జస్ట్ కొన్ని సీన్స్ కోసం మాత్రమే !

Published on Apr 19, 2024 8:36 PM IST
Theppa Samudram Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఆదర్శ్, అర్జున్ అంబటి, కిషోరి ధాత్రక్, చైతన్య రావు, రవిశంకర్ తదితరులు

దర్శకుడు: సతీష్ రాపోలు

నిర్మాత: నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్

సంగీత దర్శకుడు: పెద్దపల్లి రోహిత్

సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లి

ఎడిటింగ్: సాయిబాబు తలారి

సంబంధిత లింక్స్: ట్రైలర్

తాజాగా అర్జున్ అంబటి, కిషోరి ధాత్రక్ మరియు చైతన్య రావు ప్రధాన పాత్రల్లో సతీష్ రాపోలు దర్శకత్వంలో తెరకెక్కిన తెప్ప సముద్రం మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. మరి ఆ మూవీ ఎలా ఉందనేది పూర్తి సమీక్షలో చూద్దాం.

కథ :

ఈ కథ తెప్ప సముద్రం అనే ప్రాంతంలో జరుగుతుంది. ఇక ఈ మూవీ కథ ముఖ్యంగా తప్పిపోయిన స్కూల్ పిల్లలకు సంబంధించి సాగుతుంది. విజయ్ (అరుణ్ అంబటి) ఒక ఆటో డ్రైవర్, అయితే అతడు క్రైమ్ రిపోర్టర్ గా వర్క్ చేస్తున్న ఇందు ( కిషోరి ధాత్రక్) ని ప్రేమిస్తుంటాడు. ఇక మిస్సింగ్ కేసు లని చేధించే పనిని ఎస్సై గణేష్ (చైతన్య రావు) కి అప్పగిస్తుంది పోలీస్ శాఖ. అయితే ఒక ఘటన కారణంగా ఆ మిస్సింగ్ కేసుల వెనుక ఉంది విజయ్ అని గణేష్ కు అనుమానం కలుగుతుంది. మరి ఇంతకీ ఆ మిస్సింగ్ కేసులకు కారణం ఎవరు, ఇంతకీ ఎస్సై గణేష్ ఆ వ్యక్తిని పెట్టుకున్నాడా, మరి నిజంగానే ఆ కేసులకు విజయ్ కి సంబంధం ఉందా అనేది మొత్తం కూడా తెప్ప సముద్రం మూవీలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

అయితే ఈ మూవీకి సంబంధించి తీసుకున్న పాయింట్ గతంలో చాలా సినిమాల్లో చూసిందే. కాగా సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని ట్విస్ట్ లతో బాగానే ఆకట్టుకుంటుంది. ఇక లాస్ట్ అరగంట వరకు అసలు నేరస్థుడు ఎవరు అనేది మనకు తెలియదు, అప్పటి వరకు సినిమా ఇంట్రెస్టింగ్ గా ముందుకు నడిపాడు దర్శకుడు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే గతంలో శ్రీకాంత్ నటించిన ఒక సూపర్ హిట్ ఫాంటసీ మూవీని మనకు గుర్తు చేస్తాయి. నిజానికి తీసుకున్న పాయింట్ బాగా పాతదే అయినా ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు కథనం బాగా ముందుకు నడిపినందుకు అభినందించాలి. నటుడు అర్జున్ అంబటి థన్ పాత్రలో చక్కని యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. హీరోయిన్ కిషోరి ధాత్రక్ పాత్ర చిన్నదే అయినా అందం అభినయంతో ఆకట్టుకున్నారు. అలానే నటుడు రవిశంకర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

నిజానికి సెకండ్ హాఫ్ బాగానే నడిపిన దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై మాత్రం సరిగ్గా దృష్టి పెట్టలేదు. ఇక ఇన్వెస్టిగేటివ్ సీన్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది. ఇక మొదటి గంట మొత్తం కూడా చాల నెమ్మదిగా సాగుతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ వరకు కొంత ఇబ్బందికరంగా సాగడంతో పాటు లవ్ ట్రాక్ కూడా బోరింగ్ గా అనిపిస్తుంది. సాంగ్స్ బాగున్నప్పటికీ కథకు పెద్దగా ప్లస్ అవ్వవు. గత సినిమా కోరమీనులో హీరోయిన్ గా కిషొరి ధాత్రక్ పాత్ర బాగున్నప్పటికీ ఈ మూవీలో మాత్రం చాలా పరిమితంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఆమె సీన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇక క్రైమ్ రిపోర్టర్ గా ఆమె పాత్ర చేపట్టిన ఇన్వెస్టిగేషన్ కి సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. నటుడు చైతన్య రావు తన పాత్రకు డబ్బింగ్ చెప్పకపోవడంతో కీలక సీన్స్ లో ఇంపాక్ట్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇక కామెడీ సీన్స్ కూడా పండలేదు, వాటిని మరింత బెటర్ గా రాసుకుని ఉంటె బాగుండేది.

సాంకేతిక వర్గం :

పెద్దపల్లి రోహిత్ సాంగ్స్ ఆకట్టుకున్నా కథలో అవి ఇమడవు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. శేఖర్ పోచంపల్లి విజువల్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ ని చక్కగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ఎడిటిగ్ విభాగం వారు ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు సతీష్ రాపోలు దర్శకత్వ ప్రతిభ యావరేజ్ అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ బాగున్నా ఫస్ట్ హాఫ్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాజుకుంటే బాగుండేది.

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే తెప్ప సముద్రం మూవీ కథ పాతదే అయినా కథనం బాగుంది. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ కొన్ని ట్విస్ట్ లతో ఆకట్టుకుంటుంది. హీరో అర్జున్ అంబటి, నటుడు రవి శంకర్ తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. ఇక ఈ థ్రిల్లర్ లో ఫస్ట్ హాఫ్ విషయంలో శ్రద్ధ తీసుకుని ఉంటె మూవీ మొత్తంగా బాగుండేది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు