అక్కడ కూడా “ఉప్పెన” రీమేక్ కు అంతా సిద్ధం.!

Published on Feb 24, 2021 3:00 am IST


లేటెస్ట్ గా మన తెలుగులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం “ఉప్పెన”. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో తెరకెక్కిన ఈ చిత్రంను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించారు. అయితే కొన్నాళ్లుగా ఎదురు చూస్తూ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకొని వసూళ్ల జైత్ర యాత్రను కొనసాగిస్తుందో చూస్తున్నాము.

ఇక మన దగ్గర కొత్త కంటెంట్ తో ఓ సినిమా భారీ హిట్ అయితే దాని రీమేక్ కు ఎలాంటి డిమాండ్ ఏర్పడుతుందో కూడా తెలుసు. ఆలా ఇప్పటికే సేతుపతి తమిళ్ రీమేక్ హక్కులను కొనుగోలు చేసేసారు. అంతే కాకుండా అక్కడ సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అక్కడి యువ స్టార్ హీరో ఇషాన్ ఖట్టర్ మరియు సెన్సేషనల్ హీరోయిన్ అనన్య పాండే నటించనున్నట్టు తెలుస్తుంది. మరి అలాగే దీనిపై ఒక అధికారిక క్లారిటీ కూడా రానుంది అట. మరి అక్కడ ఈ చిత్రం ఎంత సెన్సేషన్ సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :