అదే నిజమైతే షారుక్ ఫేట్ మారినట్టే

అదే నిజమైతే షారుక్ ఫేట్ మారినట్టే

Published on Jan 21, 2020 12:21 PM IST

బాలీవుడ్ బాద్షాగా ఓ వెలుగు వెలిగిన షారుక్ తన జీవితంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని చవిచూస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలు వరుస పరాజయాలు పొందడంతో ఆయన డైలమాలో పడ్డారు. ఎటువంటి సినిమా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందీ..ఫ్యాన్స్ నానుండి ఏమి కోరుకుంటున్నారు అనే మీమాంసలో పడిపోయారు. ఆయన నటించిన చివరి చిత్రం జీరో విడుదలై ఏడాది దాటిపోయింది. ఎంతో వ్యయప్రయాలకోర్చి ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన జీరో కూడా ఆయనకు విజయం చేకూర్చలేదు. ఈ చిత్ర పరాజయం తరువాత షారుక్ అధికారికంగానే సినిమాలకు కొంత విరామం ప్రకటించారు.

మరో ప్రక్క అభిమానులు షారుక్ సినిమా ప్రకటించకపోతే సూసైడ్ చేసుకుంటాం అనే స్థితికి వెళ్లిపోయారు. ఈ తరుణంలో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తో ఆయన సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి తో షారుక్ సినిమా చేయనున్నారట. దీని గురించి షారుక్, రాజ్ కుమార్ మధ్య చర్చలు కూడా జరిగాయని బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. మరో విశేషం ఏమిటంటే షారుక్ లక్కీ లేడీ కాజోల్ తో పాటు కరీనా కపూర్ ఈ చిత్రంలో నటిస్తారట. ఇదే కనుక నిజం ఐతే షారుక్ విజయాల బాట పట్టినట్టే. 3 ఇడియట్స్, పీకే, మున్నాభాయ్, సంజు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హిరాణీకి అపజయం తెలియదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు