ఆ స్టార్ డైరెక్టర్ ఇచ్చిన కథలో మంచి కాన్సెప్ట్ ఉంది !

Published on Jul 10, 2018 10:28 am IST

యాంకర్ ప్రభాకర్ దర్శకత్వంలో ‘బ్రాండ్ బాబు’ అనే ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ సినిమాకి ప్రధాన బలం కథే అట. మారుతీ హిట్ చిత్రాలు ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ చిత్రాల లాగే ‘బ్రాండ్ బాబు’ చిత్రంలో కూడా మంచి కాన్సెప్ట్ ఉందని సమాచారం. ఇక ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ శైలేంద్ర సరసన ఈషా రెబ్బా కథానాయకిగా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ మురళీ శర్మ వాయిస్‌ తో మొదలవుతూ ‘ఎదుటి వాడి ఒంటి మీద బ్రాండ్ కనపడకపోతే మావాడి నోటినుండి మాట కూడా రాదు’ అంటూ ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జే.బీ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యస్ శైలేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :