మెగాస్టార్, మాస్ మహారాజా ఫ్యాన్స్ కి ‘వాల్తేరు వీరయ్య’ లో ఒక సర్ప్రైజ్ ఉంది – మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్

మెగాస్టార్, మాస్ మహారాజా ఫ్యాన్స్ కి ‘వాల్తేరు వీరయ్య’ లో ఒక సర్ప్రైజ్ ఉంది – మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్

Published on Dec 28, 2022 1:45 AM IST

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవితో యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మొదటి నుండి భారీ అంచనాలు ఉండడం, అలానే ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టైటిల్ టీజర్, రవితేజ టీజర్, మూడు సాంగ్స్ ఇలా అన్ని ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి. ఇక నేడు వాల్తేరు వీరయ్య మీడియా మీట్ ని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరిపారు యూనిట్ సభ్యులు.

ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ, ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ మహారాజా రవితేజ గారు కలిసి వాల్తేరు వీరయ్యలో వర్క్ చేస్తున్నందుకు ఫ్యాన్ గా తాను ఎంతో హ్యాపీ అని అన్నారు. అలానే స్క్రీన్ పై వారిద్దరి క్యారెక్టర్స్ ఎక్కడా కూడా తగ్గకుండా అలానే స్టోరీ లో ఫ్లో మిస్ అవ్వకుండా, అంతకంటే మించి వారి వారి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయకుండా ఇద్దరి క్యారెక్టర్స్ ని అద్భుతంగా రాసుకున్న దర్శకడు బాబీ కి హ్యాట్సాఫ్ అని అన్నారు. ఇక ఈ మూవీ కోసం టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాం అని, అలానే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పై స్పెషల్ గా మెగామాస్ స్టైల్ లో సాగే సాంగ్ ఒకటి ఉందని, దానిని ఇటీవల అద్భుతంగా సిద్ధం చేశామని అతి త్వరలో ఆ సర్ప్రైజింగ్ సాంగ్ మీ అందరినీ అలరిస్తుందని అన్నారు. ఇక మూవీ పై టీమ్ మొత్తానికి మంచి నమ్మకం ఉందని, తప్పకుండా సంక్రాంతికి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ప్రభంజనం ఖాయం అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు