శింబుతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన చాలా రోజుల తర్వాత హన్సిక తన మనసులో మాటను బయటపెట్టింది. శింబుతో లవ్ ఫెయిల్యూర్ పై మీ కామెంట్ అని ప్రశ్నించగా… ‘ మౌనమే నా సమాధానం అని చెప్పింది. 10 ఏళ్ళ తర్వాత కూడా నేను ఈ విషయంలో ఎం మాట్లాడదలచుకోలేదు. లవ్ ఫెయిల్యూర్ గురించి ప్రతేకంగా చెప్పడానికి ఏం లేదు. ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం వలన ఉపయోగం లేదు. చివరకు భాదపడడం తప్ప. తనను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇద్దరం సైలెంట్ గా ఉందామని చెప్పాను. నేను గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. హుందాతనంగా ఉంటాను’ అని సమాధానం ఇచ్చింది.
ప్రేమ విఫలం అయిన తర్వాత శింబుకు వ్యతిరేకంగా హన్సిక ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. తాజాగా తమిళంలో ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పంధాను కొనసాగించింది. శింబుతో కలసి నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బ్రేక్ అప్ అయిన తర్వాత కూడా అతనితో కలసి ‘వాలు’ సినిమాలో నటించాను. మా ఇద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.


