“సర్కారు వారి పాట” పై ఈ టాక్ లో నిజం లేదట.!

Published on Apr 7, 2022 5:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఊహించని టాక్ వైరల్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ మళ్ళీ బహుశా ఆగవచ్చని పోస్ట్ పోన్ అవుతుంది అని ఓ టాక్ అయితే స్టార్ట్ అయ్యింది.

కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ టాక్ లో అసలు ఎలాంటి నిజం లేదని సర్కారు వారి పాట అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది. అలాగే ఒకవేళ వాయిదా అప్డేట్ అధికారిక క్లారిటీ ఇస్తారనిటాక్. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే సినిమా రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదనే వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :