నితిన్ మూవీ టైటిల్ అది కాదట

Published on Oct 14, 2019 10:56 am IST

హీరో నితిన్ కొద్దినెలల క్రితం టాలెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటిచడం జరిగింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటి తీసింది తక్కువ చిత్రాలే అయినా, వైవిధ్యమైన చిత్రాలుగా మంచి పేరుతెచ్చుకున్నాయి. కాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ కొద్దిరోజులుగా ఒక ప్రచారం మాధ్యమాలలో జోరుగా సాగుతుంది. ఈ చిత్రానికి చదరంగం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి.

ఐతే ఈ వార్తలలో అసలు నిజం లేదని సమాచారం. చదరంగం అనే టైటిల్ దర్శక నిర్మాతల పరిగణలో లేదంట. ఓ వినూత్నమైన టైటిల్ ఆలోచిస్తున్న దర్శకుడు నవంబర్ లో ప్రకటిస్తారట. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. నితిన్ ఇప్పటికే బీష్మ, రంగ్ దే చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More