దోస్తీ మ్యూజిక్ వీడియో పై ఆ నలుగురు ఏమన్నారంటే?

Published on Aug 1, 2021 9:08 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక మ్యూజిక్ విడియో ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ దోస్తీ వీడియో కి సోషల్ మీడియా షేక్ అవుతోంది. అయితే దీని పై ప్రముఖుల, సినీ పరిశ్రమ కి చెందినవారు, అభిమానులు స్పందిస్తున్నారు. పాట అత్యద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.

అయితే టాలీవుడ్ కి చెందిన దర్శకులు, సినీ రచయిత లు ఈ పాట పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దోస్తీ వీడియో చాలా శ్రావ్యంగా గా, అతిశయోక్తి గా అనిపించింది అని ప్రముఖ దర్శకుడు దేవ కట్టా అన్నారు. కదిలే కార్చిచ్చు కి, కసిరే బడగళ్లకి, రవికి మేఘానకి దోస్తీ అంటూ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అన్నారు. దోస్తీ పాట మరియు వారి దోస్తీ ఎప్పటికీ ఉంటుంది అంటూ దర్శకుడు సంపత్ నంది అన్నారు. అయితే దోస్తీ పాట పై వీడియో విడుదల తో సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి అని, ప్రారంభం బావుంది అని, రాజమౌళి గారికి హ్యాట్సాఫ్ అని, కీరవాణి గారికి మర్యాదలు అంటూ రామ జోగయ్య శాస్త్రి అన్నారు.

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 13 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :