ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చే నాలుగు సినిమాలు డైరెక్ట్ ఓటిటి యేనా?

Published on Aug 5, 2021 8:00 pm IST

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ థియేటర్లు పునః ప్రారంభం అయినప్పటికీ పూర్తి స్థాయిలో థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు కాస్త భయాందోళన చెందే పరిస్తితి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు సినిమా మేకర్స్ సైతం ధియేటర్ రిలీజ్ కంటే కూడా ఓటిటి కి కొంచెం ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఒక ప్రొడక్షన్ హౌజ్ నుండి నాలుగు సినిమాలు వస్తుండగా, నాలుగు కూడా ఓటిటి ద్వారా విడుదల కానున్నాయి. అయితే 2డి ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్న రామే రావనే, ఉదన్ పిరప్పే, జై భీమ్, ఓహ్ మై డాగ్ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానున్నాయి. రా రా చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుండగా, ఉదన్ పిరప్పే అక్టోబర్, జై భీమ్ నవంబర్, ఓహ్ మై డాగ్ డిసెంబర్ లో విడుదల కానున్నాయి. అయితే ఈ వరుస చిత్రాలు ప్రేక్షకులని అలరించేందుకు సిద్దం అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :