“పుష్ప”కు ఇలాంటి ప్లానింగ్స్ ఏమీ లేవా?

Published on Oct 2, 2020 7:00 am IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “పుష్ప”. బన్నీ దీనికి ముందు తన మరో హ్యాట్రిక్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం పాన్ ఇండియన్ లెవెల్ వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది.

దీనితో తర్వాత సుకుమార్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసారు. స్క్రిప్ట్ పరంగా సుకుమార్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇపుడు వీరు ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియన్ చిత్రాలను ఏ తరహాలో ప్లాన్ చేస్తున్నారో తెలిసిందే. ప్రతీ ఇండస్ట్రీ నుంచి ఒక కీలక నటుడు ఉండేలా ప్లాన్ చేస్తూ వారి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. క్యాస్టింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ పుష్ప కు మాత్రం ఆ సంకేతాలు కనిపించడం లేదు. మరి ఈ చిత్రానికి సుకుమార్ అలాంటి ప్లానింగ్స్ లో ఏమన్నా ఉన్నారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :