విడుదలకు సిద్దమవుతున్న చిత్రాలు ఇవే!

Published on Jul 6, 2021 10:37 pm IST


తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో, తెలంగాణ రాష్ట్రం లో వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ తో మళ్ళీ తెరుచుకోనున్నాయి. అయితే థియేటర్లు మొదలైన అనంతరం కొన్ని సినిమాలు కొత్త సినిమాలు థియేటర్ల లో ప్రత్యక్షం కానున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టొరీ చిత్రం జూలై చివరి వారం లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా నటించిన సీటిమార్ చిత్రం కూడా జూలై లో విడుదల కి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఎస్ ఆర్ కళ్యాణ మండపం చిత్రం ఆగస్ట్ 6 వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నాని హీరో గా రీతూ వర్మ హీరోయిన్ గా వస్తున్న టక్ జగదీష్ చిత్రం ఆగస్ట్ చివరి వారం లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సాయి ధరమ్ తేజ చిత్రం రిపబ్లిక్ సెప్టెంబర్ మొదటి వారం లో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాల విడుదల తేదీల పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా, ఇంకా కొన్ని చిత్రాలు విడుదల కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :