తన బయోపిక్ కి ఆ స్టార్ హీరోల పేర్లు చెప్పిన నీరజ్ చోప్రా!

Published on Aug 8, 2021 11:30 pm IST

నిన్న ఆగష్టు 7 భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ దినం వందేళ్ల దేశ చరిత్రలో అథ్లెట్ నీరజ్ చోప్రా మొట్టమొదటి సారిగా ఒలింపిక్స్ లో దేశానికీ స్వర్ణ పథకాన్ని అందించి సువర్ణాక్షరాలతో తన పేరుని దేశ చరిత్ర పుటల్లో లిఖించాడు. అయితే ఇక అక్కడ నుంచి దేశ వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి.

దేశ వ్యాప్తంగా ఎందరో స్టార్ నటులు సహా రాజకీయ నాయకులూ నీరజ్ ని కొనియాడారు. అయితే బాలీవుడ్ మార్కెట్ లో నీరజ్ లాంటి ఎందరో వెలుగులోకి వచ్చిన చరిత్ర పేజీల్లో కనుమరుగు అయిన వారిపై కూడా బయోపిక్ సినిమాలు చాలానే వచ్చాయి. అలా తాను జావెలిన్ త్రో లో స్వర్ణం గెలిచాక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది ప్రస్తావనకు వచ్చింది.

మరి తనపై కనుక బయోపిక్ ని ఎవరైనా తీస్తే అది రణదీప్ హూదా కానీ లేదా బాలీవుడ్ మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కానీ తీయాలని అనుకుంటున్నట్టుగా తెలిపాడు. అలాగే తాను అక్షయ్ కి పెద్ద అభిమానిని అని కూడా తెలియజేసాడు. సో తన బయోపిక్ కనుక తీస్తే తన ఛాయిస్ వారని నీరజ్ మనసులో మాట చెప్పాడు. మరి బాలీవుడ్ నుంచి ఈ చిత్రం కూడా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :