సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్నేషనల్ సినిమాకి వెళుతున్న సంగతి తెలిసిందే. తన చరిష్మా లుక్స్ తో ఎప్పుడో తను ఇంటర్నేషనల్ లెవెల్ కటౌట్ అనిపించుకున్నారు. అయితే ఫైనల్ గా తన ఇంటర్నేషనల్ లెవెల్ ఎంట్రీ వారణాసి తో ఇప్పుడు జరగబోతుంది. ఇది తన కెరీర్ 29వ సినిమా కాగా ఇక దీని తర్వాతి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అందులోని బెంచ్ మార్క్ నెంబర్ 30వ సినిమా కోసం ఇప్పుడు నుంచే డిస్కషన్ లు జరుగుతున్నాయి.
తన 30వ సినిమా కోసం సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అలాగే వరుస హిట్ సినిమాల దర్శకుడు బుచ్చిబాబు సానాలు ఫ్రంట్ రేస్ లో ఉంటే ఈ కాంబినేషన్ లలో ఏదో ఒకటి పక్కా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అంతే కాకుండా సందీప్ వంగా, మహేష్ కాంబినేషన్లో సినిమాకి ఓ టాలీవుడ్ టాప్ నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలుస్తోంది. సో ఇలా మహేష్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ రచ్చ నడుస్తోంది.


