“తిమ్మరుసు” ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్..!

Published on Aug 6, 2021 9:00 pm IST


కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు గత వారం తెరుచుకోవడంతో తిమ్మరుసు, ఇష్క్ వంటి ఒకటి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అయితే గత వారం సినిమాల్లో “తిమ్మరుసు” చిత్రానికి ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. టాక్ అయితే పాజిటివ్‌గా వచ్చింది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా ఇంకా వెనుకబడే ఉంది. అసలు “తిమ్మరుసు” సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

నైజాం 0.65 కోట్లు, సీడెడ్ 0.21 కోట్లు, ఉత్తరాంధ్ర 0.27, కోట్లు, ఈస్ట్ 0.16 కోట్లు, వెస్ట్ 0.09 కోట్లు, గుంటూరు 0.11 కోట్లు, కృష్ణా 0.14 కోట్లు, నెల్లూరు 0.07 కోట్లు రాబట్టగా ఏపీ మరియు తెలంగాణ కలిపి 1.70 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి 0.13 కోట్లు, ఇక వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 1.83 కోట్లు సాధించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సత్యదేవ్‌కి మార్కెట్ బాగానే ఉండడంతో ‘తిమ్మరుసు’ సినిమాను మేకర్స్ రూ.2.4 కోట్లకు అమ్మారు. అయితే ఈ సినిమా విజయం సాధించాలంటే కనీసం 3 కోట్ల వరకైనా వసూళ్లను రాబట్టాలి. కానీ ఈ చిత్రం వారం రోజుల్లో కేవలం రూ.1.83కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ వారం కొత్త సినిమాలు రావడంతో మిగిలిన టార్గెట్ రీచ్ కావడం “తిమ్మరుసు”కు కష్టమనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :