3వ పాటను విడుదలచేయనున్న ‘నా పేరు సూర్య’ టీమ్ !

పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాల టీజర్లతో ప్రేక్షకుల నుండి బోలెడంత అటెంక్షన్ ను సొంతం చేసుకున్న సినిమా ‘నా పేరు సూర్య’. ఇందులో అల్లు అర్జున్ దేశభక్తి, అమితమైన కోపం కలిగిన సైనికుడిగా కనిపించాబోతున్నాడు. ఇప్పటీకే ఈ సినిమా నుండి ‘లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో, సైనికా’ వంటి పాటలు విడుదలై ప్రేక్షకుల్ని అలరించగా ఇప్పుడు మూడో పాట ‘బ్యూటిఫుల్ లవ్’ ఏప్రిల్ 13న రిలీజ్ కానుంది.

ప్రముఖ రచయితా సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఈ పాటను రచించారు. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ నెలాఖరున చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన మే 4న సినిమాను విడుదలచేయనున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష శ్రీధర్, బన్నీ వాసులు నిర్మిస్తున్నారు.