‘మసూద’, ‘పరేషాన్’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ రూరల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం జూలై 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్‌గా సాగింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను ఎవరు తాకినా వారికి కరెంట్ షాక్ కొడుతుంది. ఈ విచిత్రమైన సమస్య కారణంగా ఆమె పెళ్లి పెటాకులు అవుతుండగా, హీరో తిరువీర్ ఆమెను ఇష్టపడి పెళ్లికి అంగీకరిస్తాడు. అయితే ఆమె సమస్య వెనుక ఉన్న అసలు నిజం తెలియని హీరో, పెళ్లయ్యాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వారి బంధం ఎలా ముందుకు సాగింది? అనే అంశాలను దర్శకుడు ఎంటర్‌టైనింగ్‌తో పాటు ఎమోషనల్‌గా ట్రైలర్‌లో చూపించాడు.
కథను పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం ఆసక్తికర అంశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి అంచనాలను క్రియేట్ చేసిన ‘ఓ సుకుమారి’ ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


