యంగ్ టైగర్ నెక్స్ట్ కి ఈ బాలీ స్టార్ హీరోయిన్ ఫిక్స్.?

Published on Sep 15, 2021 5:05 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” సినిమా కంప్లీట్ చేసి గ్రాండ్ రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వీటి అనంతరం తారక్ తన మరో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చెయ్యనున్నాడు. తన కెరీర్ లో 30వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం పై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి.

అయితే ఈ భారీ చిత్రం ఇంకా స్టార్టింగ్ కి ముందు ప్రధాన క్యాస్టింగ్ ఫైనల్ కానుంది. మరి ఇప్పటికే తారక్ సరసన హీరోయిన్ ఎవరు అన్నది ఎప్పుడు నుంచో మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. మరి దీనికి సమాధానం దొరికేసినట్టే అని సూచనలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఫిక్స్ అయ్యినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది వరకు దీనికి కియారా పేరు వినిపించింది కానీ ఆలియా నే ఫైనల్ అయ్యినట్టు ఇపుడు తెలుస్తుంది మరి దీనిపై అధికారిక క్లారిటీ వస్తే సమాధానం దొరికినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :