మహేష్ తో మళ్ళీ వర్క్ చెయ్యాలంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Published on Jun 11, 2021 8:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “1 నేనొక్కడినే”. అయితే ఈ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్ అయినా మిగతా అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఈ సినిమా తోనే హీరోయిన్ గా పరిచయం అయిన కృతి సనన్ ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారి ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటైన “ఆదిపురుష్” లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే లేటెస్ట్ గా తన ఇన్స్టా చాట్స్ లో మహేష్ కోసం ఒక్క మాట అడగ్గా కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ బెస్ట్ అని చాలా హంబుల్ గా ఉంటారని అలాగే తనతో వర్క్ కూడా అమేజింగ్ గా ఉంటుందని తెలిపింది. అలాగే మరోసారి మహేష్ తో వర్క్ చెయ్యాలని ఉందని కృతి తన మనసులో మాట చెప్పింది. అప్పటిలో ఈ పర్ఫెక్ట్ కాంబో మంచి ఇంపాక్ట్ కలిగించింది. మరి ఇప్పుడు ఎలాగో పరిస్థితులు మారాయి కాబట్టి ఓ సరైన పాన్ ఇండియన్ ఫ్లిక్ సెట్ చేసేస్తే సరి..

సంబంధిత సమాచారం :